
షోస్

శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ముఖ్యమైన సమాచారం. మండల-మకరవిళక్కు యాత్ర సీజన్లో భాగంగా శబరిమల ఆలయం నేడు సాయంత్రం 5 గంటలకు తిరిగి తెరుచుకోనుంది. ఈ యాత్రకు సంబంధించి ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు, భద్రత, ఇతర సౌకర్యాలను సిద్ధం చేసింది.
ఈ సీజన్లో రోజుకు గరిష్ఠంగా 80 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించనున్నారు. అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా వర్చువల్ క్యూ విధానంలో ఆన్లైన్ ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకోవాలి. జనవరి 14న మకరవిళక్కు ఉత్సవం నిర్వహించనుండగా, జనవరి 20న ఆలయాన్ని మూసివేయనున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!