4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సంక్రాంతి సీజన్‌లో కోడి కత్తుల వ్యాపారానికి జోరు!

Writer: Pooja 10:11 AM, 12 జనవరి, 2026
సంక్రాంతి సీజన్‌లో కోడి కత్తుల వ్యాపారానికి జోరు!

చిన్నగా కనిపించే కోడి కత్తి తగిలితే రక్తం ధారలుగా పారుతుంది. ఒక్క దెబ్బతోనే గాయపడిన కోడి క్షణాల్లో కుప్పకూలిపోతుంది. కోడి పందేల బరుల్లో కోడి కత్తుల పాత్ర అత్యంత కీలకమైనది. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో ప్రతి గ్రామంలోనూ కోడి కత్తుల గురించే చర్చ జరుగుతోంది.

విరగదు.. వంగదు..
కోడి కత్తులను ఆరు అంచెల్లో సాన పెడతారు. విరగకుండా, మొన వంగకుండా ఉండాలంటే అత్యంత గట్టిదనం అవసరం. అందుకే భారీ వాహనాల చక్రాల బేరింగుల్లో ఉపయోగించే స్టెయిన్‌లెస్ స్టీల్‌తో వీటిని తయారు చేస్తారు. మరింత బలం కోసం ఆరు సార్లు కొలిమిలో కాల్చుతారు.

కత్తి కట్టే వారే కీలకం
సంక్రాంతి కోడి పందేల బరుల్లో పుంజు కాళ్లకు కత్తులు కట్టే వారికి మంచి గిరాకీ ఉంటుంది. పండగ నాలుగు రోజుల పాటు వీరికి భారీ డిమాండ్ ఉంటుంది. కత్తి కట్టడంపైనే పందెం ఫలితం ఆధారపడి ఉంటుందని నిర్వాహకులు భావిస్తారు. పందెం పుంజు కుడికాలి పిల్లవేలికి కత్తిని కడతారు. పందెం జరుగుతున్నంతసేపూ కత్తి కట్టిన వ్యక్తి పుంజు కాళ్లను గమనిస్తూనే ఉంటాడు. కత్తి విరిగినా లేదా దిశ మారినా పందెం నిలిపివేసి సరిచేసి మళ్లీ ప్రారంభిస్తారు. పందెం గెలిస్తే లక్షల రూపాయలు చేతులు మారుతాయి. అందుకే కత్తి కట్టే వారికి రోజుకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు పారితోషికం ఇస్తారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో కేంద్రాలు
రాష్ట్రంలో కోడి కత్తుల తయారీ కేంద్రాలు ఎక్కువగా పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం, నూజివీడు, గురవాయిపాలెం, ముప్పర్తిపాడు ప్రాంతాల్లో ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ముమ్మిడివరం, కాట్రేనికోన, ఎదుర్లంక, సామర్లకోట, అనపర్తి ప్రాంతాల్లో తయారీదారులు ఉన్నట్లు సమాచారం. ఉభయ గోదావరి జిల్లాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు కూడా కోడి కత్తులు తరలిస్తున్నారు. సంక్రాంతి సీజన్‌లో ఈ వ్యాపారం సుమారు రూ.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

రోజుకు పది కాదు.. ఐదే!
ఒక వ్యక్తి రోజుకు 5 నుంచి 6 కత్తుల వరకు మాత్రమే తయారు చేయగలడు. అందుకే సంక్రాంతి సీజన్ కోసం ఏడాది పొడవునా వీటి తయారీ కొనసాగుతుంది. గతంలో ఒక్క కత్తి ధర రూ.200 నుంచి రూ.300 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.1000 వరకు పలుకుతోంది. ముడి ఇనుమును చెన్నై, విజయవాడ, తిరువూరు వంటి ప్రాంతాల నుంచి తెస్తారు. ఒక కత్తిని ఒక్క పందెంకు మాత్రమే ఉపయోగిస్తారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దక్షిణ కోస్తాను ముంచెత్తిన భారీ వర్షాలు

దక్షిణ కోస్తాను ముంచెత్తిన భారీ వర్షాలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ, డీఆర్‌ 3 శాతం పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ, డీఆర్‌ 3 శాతం పెంపు

అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న వ్యోమగాములు

అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న వ్యోమగాములు

ఏపీకి మరో తుఫాను ముప్పు..

ఏపీకి మరో తుఫాను ముప్పు..

దీపావళి సందర్భంగా చెన్నై సెంట్రల్‌-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

దీపావళి సందర్భంగా చెన్నై సెంట్రల్‌-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

సదర్ ఉత్సవాలు యాదవుల ఆత్మగౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్ రెడ్డి

సదర్ ఉత్సవాలు యాదవుల ఆత్మగౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్ రెడ్డి

ట్యాగ్లు
సంక్రాంతికోడి పందేలుకోడి కత్తులుపండుగ సంప్రదాయంగ్రామీణ సంస్కృతిఉభయ గోదావరి జిల్లాలుపండుగ సందడిస్థానిక వ్యాపారంసంప్రదాయ ఆటలుసంక్రాంతి సీజన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సూపర్ డైవ్‌తో సింగిల్ హ్యాండ్ క్యాచ్.. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా!
క్రీడలు

సూపర్ డైవ్‌తో సింగిల్ హ్యాండ్ క్యాచ్.. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా!

కండక్టర్ ప్రవళిక కుటుంబానికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. మంత్రి పొన్నం హామీ
జనరల్

కండక్టర్ ప్రవళిక కుటుంబానికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. మంత్రి పొన్నం హామీ

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు!
రాజకీయాలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు!

కింగ్ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్!
సినిమాలు

కింగ్ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్!

బిగ్‌బాస్ తెలుగు 10 : అదేంటి.. వర్షిణికి వాళ్లిద్దరూ అలా కౌంటర్ ఇచ్చారేంటి?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 : అదేంటి.. వర్షిణికి వాళ్లిద్దరూ అలా కౌంటర్ ఇచ్చారేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10: హౌస్‌లో రెండు గ్రూపులుగా విడిపోయిన కంటెస్టెంట్లు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: హౌస్‌లో రెండు గ్రూపులుగా విడిపోయిన కంటెస్టెంట్లు

దక్షిణ కోస్తాను ముంచెత్తిన భారీ వర్షాలు
జనరల్

దక్షిణ కోస్తాను ముంచెత్తిన భారీ వర్షాలు

భారీ బ్యాటరీ, అద్భుతమైన డిస్‌ప్లేతో REDMAGIC కొత్త గేమింగ్ ఫోన్ లాంచ్
టెక్నాలజీ

భారీ బ్యాటరీ, అద్భుతమైన డిస్‌ప్లేతో REDMAGIC కొత్త గేమింగ్ ఫోన్ లాంచ్

త్రివిక్రమ్‌కు అసలైన పరీక్ష?
సినిమాలు

త్రివిక్రమ్‌కు అసలైన పరీక్ష?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ, డీఆర్‌ 3 శాతం పెంపు
జనరల్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ, డీఆర్‌ 3 శాతం పెంపు

బాలయ్య, మంచు మనోజ్ మధ్య మాటల యుద్ధం?
సినిమాలు

బాలయ్య, మంచు మనోజ్ మధ్య మాటల యుద్ధం?

అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న వ్యోమగాములు
జనరల్

అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న వ్యోమగాములు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!