
జనరల్

భూమికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి ముగ్గురు వ్యోమగాములు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత సంతతికి చెందిన వ్యోమగామి అనిల్ మీనన్ టెక్సాస్ ఎన్నికల్లో భాగంగా మైక్రోగ్రావిటీ వాతావరణంలో ఉండి ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. అంతరిక్షంలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములయ్యారు.
అంతరిక్ష కేంద్రంలోని ల్యాప్‌టాప్ ద్వారా వ్యోమగాములు డిజిటల్ పద్ధతిలో ఓటు వేశారు. నాసా కమ్యూనికేషన్ వ్యవస్థ సహాయంతో ఈ ఓట్లు సురక్షితంగా భూమికి చేరి సంబంధిత అధికారులకు అందినట్లు సమాచారం. అనిల్ మీనన్ ఈ ప్రక్రియకు సంబంధించిన వీడియోను ఆన్‌లైన్‌లో పంచుకోవడంతో అది వైరల్‌గా మారింది. అంతరిక్షం నుంచే ఓటు హక్కును వినియోగించుకోవడం పలువురి దృష్టిని ఆకర్షించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!