
రాజకీయాలు

హైదరాబాద్ సదర్ ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి యాదవ సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పశుసంపద వైభవానికి ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాలు యాదవుల ఆత్మగౌరవం, ఐక్యత, వారసత్వ గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. ఈ వేడుకలు యాదవుల సాంస్కృతిక వైభవాన్ని చాటిచెబుతాయని అన్నారు.
ప్రత్యేకంగా అలంకరించిన దున్నపోతుల ప్రదర్శనలు, వాటి ఠీవి, దర్పం, ఉత్సాహభరితమైన సందడి సదర్ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సీఎం తెలిపారు. ఈ పండుగ ప్రతి యాదవ కుటుంబంలో ఆనందోత్సాహాలు నింపాలని, అందరికీ సిరిసంపదలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. యాదవుల ఐక్యత, అభ్యున్నతి మరింత బలోపేతం కావాలని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!