
రాజకీయాలు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులను చేవెళ్ల వాసులుగా గుర్తించారు.
వివరాల ప్రకారం, బాధితులు తుల్జాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని వెంటనే జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!