

బీహార్‌లో ఏకే-47 కాల్పుల ఘటనపై ఆర్జేడీ చేపట్టిన రాజ్‌భవన్ మార్చ్ ఉద్రిక్తతకు దారితీసింది. పాట్నాలోని జేపీ గోల్‌అంబర్ నుంచి రాజ్‌భవన్ వైపు ఆర్జేడీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. మార్చ్‌ను పోలీసులు వాటర్ కేనన్లతో అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చేపట్టిన చర్యలు సీఎం సామ్రాట్ చౌదరి ఆదేశాల మేరకేనని ఆర్జేడీ నేతలు ఆరోపించారు.
సివాన్ జిల్లాలో జూలై 25న నీట్ ప్రశ్నాపత్ర లీక్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసన సమయంలో ఓ కానిస్టేబుల్ ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు జరిపిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయగా, జిల్లా ఎస్పీని బదిలీ చేశారు. కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని, తనను చుట్టుముట్టిన పరిస్థితుల్లోనే కానిస్టేబుల్ కాల్పులు జరిపినట్లు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. విద్యార్థులపై ఏకే-47ఉపయోగించేందుకు అనుమతి ఎవరు ఇచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆర్జేడీ ఎంపీ మీసా భారతి డిమాండ్ చేశారు. పేపర్ లీకులు, నిరుద్యోగం, విద్యార్థులు, యువత సమస్యలపై కూడా ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!