

చిరంజీవి నటించిన ‘డాడీ’ చిత్రం 2001లో సురేశ్‌కృష్ణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినప్పటికీ, చిరంజీవి కెరీర్‌లోని భారీ విజయాల స్థాయిలో నిలవలేకపోయింది. తాజాగా ఈ చిత్రం విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన తెరవెనుక విషయాలు మరోసారి చర్చలోకి వచ్చాయి.
‘డాడీ’ కథను తొలుత చిరంజీవికి వినిపించగా, కథ విన్న వెంటనే ఇది తనకంటే వెంకటేశ్‌కు బాగా సరిపోతుందని ఆయన భావించారట. ఈ విషయాన్ని రచయిత భూపతిరాజాతో కూడా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే వెంకటేశ్‌కు ఈ కథ సాధారణ కుటుంబ కథలా ఉంటుందని, తనకు చేస్తే ఫ్యామిలీ మ్యాన్‌గా భిన్నమైన ఇమేజ్ వస్తుందని భూపతిరాజా చిరంజీవిని ఒప్పించే ప్రయత్నం చేశారట. ఇతరులు కూడా చిన్నపిల్లతో కూడిన ఈ కథ తనకు బాగా సరిపోతుందని సూచించడంతో చివరకు చిరంజీవి ఈ సినిమాను అంగీకరించారట. సినిమా విడుదలైన తర్వాత వెంకటేశ్ ఫోన్ చేసి, ఈ కథ తనతో అయితే మరింత బాగా ఆడేదని చెప్పగా, తాను ముందే అదే విషయం చెప్పానని చిరంజీవి సరదాగా అన్నట్లు సమాచారం.
‘డాడీ’ ఫలితం ఎలా ఉన్నప్పటికీ సినిమాలోని పాటలు మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘గుమ్మాడీ.. గుమ్మాడీ’ పాట తండ్రి-కూతురు అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఇప్పటికీ ఎంతో మందికి ప్రత్యేకంగా నిలిచింది. ‘నా ప్రాణమా’, ‘వానా వానా’ వంటి పాటలు కూడా శ్రోతల ఆదరణ పొందాయి. దీంతో 25 ఏళ్ల తర్వాత కూడా ‘డాడీ’ సినిమా కథ కంటే ముందుగా దాని సంగీతం, చిరంజీవి-వెంకటేశ్‌కు సంబంధించిన ఈ ఆసక్తికరమైన విషయం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!