
జనరల్

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన అంశంపై విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జయస్‌వాల్ స్పందించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల విదేశీ పర్యటనలకు అనుమతి ఇచ్చే ముందు విదేశీ వ్యవహారాల శాఖ వివరాలను పరిశీలిస్తుందని తెలిపారు. పర్యటన ఉద్దేశం, నిర్వహిస్తున్న పదవికి అనుగుణంగా ఉందా అనే అంశాలను పరిశీలించిన తర్వాతే అనుమతి మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
రేవంత్‌రెడ్డి యూకే పర్యటనకు అనుమతి లభించిందని, అయితే అమెరికా పర్యటన విషయంలో నిర్దేశిత నిబంధనలను పాటించలేదని జయస్‌వాల్ పేర్కొన్నారు. అందుకే అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించినట్లు వెల్లడించారు. విదేశీ పర్యటనలకు సంబంధించిన అనుమతుల విషయంలో నిబంధనల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!