
సినిమాలు

తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మాజీ RBI గవర్నర్ రఘురాం రాజన్‌ను విద్యలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగంపై హై లెవల్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రాథమిక, ఇంటర్మీడియట్, టెక్నికల్, మెడికల్ విద్యలో ఏఐని ఎలా ఉపయోగించాలి అనే విషయంపై సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
జూబ్లీహిల్స్‌లో జరిగిన భవిష్యత్తు ప్రణాళిక సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రఘురాం రాజన్ కూడా హాజరయ్యారు. ఏఐ సరైన విధంగా ఉపయోగిస్తే పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆయన తెలిపారు. స్టార్టప్స్, పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ అనుకూలంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!