

రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించారు. ఈ పాఠశాలను రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ పాఠశాలలో 1,814 మంది విద్యార్థులు చేరడం ప్రజల విశేష స్పందనకు నిదర్శనమని పేర్కొన్నారు.
తెలంగాణ భవిష్యత్ అద్దాల మేడల్లో కాదు, తరగతి గదుల్లోనే ఉందని ఆయన అన్నారు. విద్యాకమిషన్ నివేదిక ప్రకారం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాం, కిట్లు అందించడంతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్కిల్స్ యూనివర్సిటీని డిసెంబర్ 9న ప్రారంభించనున్నట్లు చెప్పారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!