

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఎల్లమ్మ’. దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ ‘పర్షి’ అనే పల్లెటూరి యువకుడి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆయన డీ-గ్లామర్ లుక్‌లో, సహజమైన హావభావాలతో ఆకట్టుకున్నారు. పల్లెటూరి నేపథ్యానికి తగ్గట్టుగా ఆయన గెటప్ ఆసక్తిని పెంచుతోంది.
‘బలగం’తో గ్రామీణ కథాంశాన్ని ప్రేక్షకుల హృదయాలకు చేరువ చేసిన వేణు యెల్దండి, ‘ఎల్లమ్మ’లోనూ సంప్రదాయాలు, మానవ సంబంధాల నేపథ్యంలో కథను రూపొందిస్తున్నారు. పోస్టర్‌లో దేవిశ్రీ ప్రసాద్ చేతిలో ఎల్లమ్మ అమ్మవారి విగ్రహం కనిపించడంతో, ఆయన పాత్రకు గ్రామ జాతరలు, సంప్రదాయాలతో అనుబంధం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సంగీత దర్శకుడిగా విజయాలు అందుకున్న దేవిశ్రీ ప్రసాద్, నటుడిగా ‘పర్షి’ పాత్రలో ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!