

రేవంత్ రెడ్డి మైనారిటీ విద్యార్థుల అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసి, వాటిలో నైపుణ్యాభివృద్ధి మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సచివాలయంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ శాఖ సమీక్ష సమావేశంలో సీఎం సంప్రదాయ కోర్సులకంటే ఉపాధి అవకాశాలు కల్పించే శిక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తరహాలోనే ప్రతిభావంతులైన మైనారిటీ విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం సూచించారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3లో ఎంపికైన అభ్యర్థులు, క్రీడాకారులను విద్యార్థులకు ప్రేరణగా నిలిపేలా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఇమామ్‌లు, మౌజమ్‌లకు గౌరవ వేతనాలు సమయానికి చెల్లించాలని ఆదేశించిన సీఎం.. మైనారిటీ పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధనను ప్రోత్సహించాలని సూచించారు. డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రణాళికను కూడా ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!