

రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలను కూడా బాధ్యులను చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన డ్రగ్స్ నిరోధం, భద్రత కమిటీల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్యాంపస్‌లోనే కాకుండా బయట జరిగే అనుమానాస్పద కార్యకలాపాలపై కూడా యాజమాన్యాలు నిఘా పెట్టే విధానాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
డ్రగ్స్ నియంత్రణ కోసం అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. విద్యా సంస్థల్లో ప్రత్యేక పర్యవేక్షణ విభాగాలు ఏర్పాటు చేయడం, టోల్‌ఫ్రీ నంబర్లు, క్యూ ఆర్ కోడ్‌ల ద్వారా సమాచారం స్వీకరించడం, డ్రగ్స్ కేసుల్లో గుర్తింపు, డీ అడిక్షన్, పునరావృతమైతే కఠిన శిక్షలు అమలు చేసే మూడు దశల వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!