

గుంటూరు నగరంలోని ప్రధాన డ్రెయిన్ల శుద్ధీకరణ, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ మున్సిపల్, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నాలుగో వార్డులోని మణిపురం క్యాబిన్ రోడ్డులో డ్రెయిన్లను ఆయన పరిశీలించారు. ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణల కారణంగా వర్షపు నీరు వెళ్లే మార్గం లేక రోడ్డుపైకి ప్రవహిస్తున్నట్లు గుర్తించారు.
దీంతో ఆక్రమణలను యుద్ధప్రాతిపదికన తొలగింపజేసి, డ్రెయిన్‌ను పూర్తిగా సర్వే చేయాలని అధికారులకు సూచించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రధాన వాగులు, డ్రెయిన్లలో పక్కాగా సిల్టేషన్ చేపట్టాలని చెప్పారు. ప్రకాశ్ నగర్, రామిరెడ్డితోట, వినోభా నగర్ వంటి లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాల సమయంలో నీరు నిలిచే అవకాశం ఉన్నందున వెంటనే సిల్టేషన్ పనులకు అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. భవిష్యత్తులో మురుగు సమస్యలు తలెత్తకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని, మణిపురం క్యాబిన్ రోడ్డులో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!