
జనరల్

అండమాన్ నికోబార్ దీవుల్లోని క్యాంప్‌బెల్ బే వద్ద చేపట్టిన గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు దేశ సహజ, గిరిజన వారసత్వ సంపదకు వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కారణంగా 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో లక్షల చెట్లు నరికివేయాల్సి వస్తుందని, ఇది అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసమని ఆయన విమర్శించారు.
ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానని రాహుల్ తెలిపారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉన్న గిరిజన నాయకులను కలవడానికి ఆయన క్యాంప్‌బెల్ బేను సందర్శించి తన పర్యటన వివరాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!