

ప్రపంచ పటంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. శతాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉన్న మెర్కేటర్ ప్రపంచ పటానికి బదులుగా భూమి ఉపరితలాన్ని మరింత కచ్చితంగా చూపించే ఈక్వల్ ఎర్త్ మ్యాప్‌ను వినియోగించేందుకు ఐక్యరాజ్యసమితి కీలక తీర్మానం చేసింది. ఈ కొత్త ప్రపంచ పటంలో ఖండాల అసలు విస్తీర్ణానికి దగ్గరగా వాటి పరిమాణాలు కనిపిస్తాయి. దీంతో ఆఫ్రికా మరింత పెద్దగా కనిపించగా, ఐరోపా, ఉత్తర అమెరికా పరిమాణం తక్కువగా కనిపిస్తుంది.
ఐక్యరాజ్యసమితి తీర్మానానికి 164 దేశాలు మద్దతు తెలిపాయి. అమెరికా మాత్రం తీర్మానాన్ని వ్యతిరేకించగా, మరో ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఖండాల వాస్తవ విస్తీర్ణానికి అనుగుణంగా రూపొందించిన ఈ కొత్త ప్రపంచ పటాన్నే వినియోగించాలని ఐరాస సభ్య దేశాలను కోరింది. ప్రపంచంలోని దేశాలు, ఖండాల పరిమాణాలను మరింత కచ్చితంగా అర్థం చేసుకునేలా ఈ మ్యాప్ ఉపయోగపడుతుందని పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!