

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్ 16న ఢాకాకు తిరిగి వెళ్లాలని యోచిస్తున్నట్లు ఆమె అధికార ప్రతినిధి సయ్యద్ మొజామెల్ అలీ రాయిటర్స్‌కు వెల్లడించినట్లు కథనం పేర్కొంది. 2024 ఆగస్టు 5న విద్యార్థుల నేతృత్వంలో జరిగిన భారీ ఆందోళనల నేపథ్యంలో 15 ఏళ్ల పాలన ముగియడంతో హసీనా బంగ్లాదేశ్‌ను విడిచి భారత్‌కు వచ్చారు. ఇప్పుడు ఆమె తిరిగి వెళ్లేందుకు డిసెంబర్ 16ను ఎంచుకున్నట్లు సమాచారం. ఈ తేదీ బంగ్లాదేశ్ విజయ దినోత్సవం కావడం గమనార్హం. 1971లో పాకిస్థాన్‌పై విజయం సాధించి స్వాతంత్ర్యం పొందిన సందర్భంగా ఆ దేశం ఈ రోజును జరుపుకుంటుంది.
అయితే హసీనా తిరుగు ప్రయాణంపై అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. 2024 ఆందోళనల అణచివేతకు సంబంధించిన కేసుల్లో బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ 2025 నవంబర్‌లో ఆమెకు గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. ఆమె పార్టీ అవామీ లీగ్‌పై నిషేధం కూడా కొనసాగుతున్నట్లు కథనం తెలిపింది. హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తే అరెస్ట్ చేస్తామని ప్రస్తుత ప్రభుత్వం హెచ్చరించినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి ఢాకాకు బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ ద్వారా ప్రయాణ ఏర్పాట్లు చేయాలని ఆమె కోరినట్లు అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో డిసెంబర్ 16న ఆమె నిజంగా తిరిగి వెళ్తారా అన్నది ఉత్కంఠగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!