

ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ సంస్థలు తీసుకునే నిర్ణయాలను విమర్శించే హక్కు పౌరులకు ఉందని, అయితే ఆ సంస్థలనే లక్ష్యంగా చేసుకోవడం సరికాదని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. ఆదివారం ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పదో స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులతో మాట్లాడారు. ప్రజలు కొన్నిసార్లు ఒక నిర్ణయానికి, ఆ నిర్ణయం తీసుకున్న సంస్థకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ధోరణి ప్రజాస్వామ్య మనుగడకు కీలకమైన రాజ్యాంగ సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ సందర్భంగా హిమాలయ పర్వతాలను ఉదాహరణగా తీసుకున్న సీజేఐ.. జీవితంలో లక్ష్యాలను చేరుకోవడానికి విద్యార్థులు సహనం, పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. కొండ ప్రాంతాల్లో ఏ గమ్యస్థానానికీ మార్గం సరళరేఖలో ఉండదని, అలాగే ఎవరూ పర్వతాన్ని ఒంటరిగా అధిరోహించలేరని పేర్కొన్నారు. విజయాన్ని సాధించాలంటే కష్టాలను ఎదుర్కొంటూ, ఇతరుల సహకారంతో ముందుకు సాగాలని విద్యార్థులకు హితవు పలికారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!