

అయోధ్య రామ మందిరానికి 2021 జనవరి 26న 200 కిలోల వెండి కడ్డీలను విరాళంగా అందజేశామని క్యాజిల్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజు వి. మన్వానీ తెలిపారు. ఆ సమయంలో చంపత్ రాయ్‌కు ఈ వెండి కడ్డీలను అప్పగించామని, అప్పటి మార్కెట్ విలువ సుమారు రూ.1.5 నుంచి రూ.2 కోట్ల వరకు ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం అదే వెండి విలువ రూ.6 నుంచి రూ.7 కోట్ల మధ్య ఉంటుందని ఆయన చెప్పారు.
విరాళం అందజేసిన సమయంలో ఎలాంటి రసీదు ఇవ్వలేదని, నమ్మకంతో తాము ఆ విషయాన్ని పట్టించుకోలేదని డాక్టర్ రాజు మన్వానీ వెల్లడించారు. అయితే ఇటీవల విరాళాల దుర్వినియోగంపై వస్తున్న వార్తల నేపథ్యంలో తమ వెండి కడ్డీల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు తమ విరాళాల గురించి ప్రశ్నించే హక్కు కలిగి ఉన్నారని, విరాళాలను దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!