
జనరల్

అమెరికాతో యుద్ధాన్ని కొనసాగించాలని ఇరాన్ కోరుకోవడం లేదని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ యుద్ధాన్ని ఎప్పుడు ముగించాలనేది అమెరికానే నిర్ణయించాల్సి ఉంటుందని అన్నారు. అమెరికాతో ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా ఉందని పేర్కొన్న ఆయన, అయితే అమెరికా ఒత్తిడికి తమ దేశం లొంగబోదని స్పష్టం చేశారు.
మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. యెమెన్‌కు చెందిన హూతీ ఉద్యమం సౌదీ అరేబియాపై దాడులను కొనసాగిస్తోంది. తైఫ్, ఎర్ర సముద్ర ప్రాంతాల వైపు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్లు సౌదీ అధికారులు తెలిపారు. ఈ పరిణామాలతో ప్రాంతీయ భద్రత, చమురు సరఫరా, కీలక సముద్ర మార్గాలపై ఆందోళనలు మరింత పెరిగాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!