

దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో సహ పైలట్ దాడికి గురైన భారత కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు తీవ్ర గాయాలైనట్లు తాజా వివరాలు వెల్లడయ్యాయి. తల, చేతులకు లోతైన గాయాలు కావడంతో ఆయనకు తీవ్ర రక్తస్రావం జరిగినట్లు విమానంలోని దంత వైద్యుడు డాక్టర్ షోటా ముసాయేవ్ తెలిపారు. దాడి అనంతరం స్మిత్‌కు విమానంలోనే ప్రాథమిక చికిత్స అందించిన ఆయన.. రక్తస్రావాన్ని అదుపు చేసి పైలట్ రక్తపోటును స్థిరీకరించేందుకు ప్రయత్నించారు.
స్మిత్ పరిస్థితి కొంతసేపు ఆందోళనకరంగా మారినప్పటికీ, అనంతరం సౌదీ అరేబియాలోని తబూక్లో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిన తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతుండగా, భారత రాయబార కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం స్మిత్ పరిస్థితి స్థిరంగా ఉంది. విమానంలో తీవ్ర గాయాలతో ఉన్న స్మిత్ ప్రాణాలను కాపాడేందుకు డాక్టర్ షోటా ముసాయేవ్ అందించిన తక్షణ వైద్య సహాయం కీలకంగా మారింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!