

తెలంగాణ ముఖ్యమంత్రి అధ్యక్షతన నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్–2027 నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, హైదరాబాద్ మెట్రో ఫేజ్–1 స్వాధీనం, మెట్రో ఫేజ్–2 విస్తరణ, నిర్మాణ వ్యయంపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మూసీ రివర్ ప్రాజెక్టు ఫేజ్–1 అమలు, భూసేకరణకు సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ దృష్టి సారించనుంది.
ఇక ప్రాంతీయ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణం, నిధుల కేటాయింపు, అవసరమైన అనుమతులపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కరవు భత్యం (DA), వేతన సవరణ సంఘం (PRC), పెండింగ్ బిల్లుల అంశాలు కూడా సమావేశం ఎజెండాలో ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు రాజీవ్ యువ వికాసం పథకం అమలు విధివిధానాలు, దరఖాస్తులు, ప్రారంభ తేదీపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై వివిధ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!