

చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్పవృక్ష వాహన సేవ భక్తిశ్రద్ధల మధ్య కన్నులపండువగా జరిగింది. దేవస్థానం సిబ్బంది, అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి గ్రామోత్సవాన్ని కాణిపాకం పురవీధుల్లో ఘనంగా నిర్వహించారు.
మేళతాళాలు, కోలాటాలు, కేరళ సంప్రదాయ వాయిద్యాలు, తప్పెటగుళ్ల కళాకారుల ప్రదర్శనలతో గ్రామోత్సవం సందడిగా సాగింది. వివిధ కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్వామివారి వాహన సేవను దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులతో కాణిపాకం పురవీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్, ఏఈవోలు, ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు, వేద పండితులు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!