
రాజకీయాలు

విశాఖపట్నంలోని ఎన్ఏడీ ఫ్లైఓవర్‌పై అర్ధరాత్రి భారీ ప్రమాదం తృటిలో తప్పింది. గాజువాక నుంచి నగరం వైపు వెళ్తున్న భారీ కంటైనర్ వాహనం ఫ్లైఓవర్ రోటరీ వద్ద మలుపు తిరిగే సమయంలో అదుపుతప్పి బోల్తాపడింది. సాధారణంగా రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రమాద సమయంలో జనసంచారం లేకపోవడంతో ప్రాణనష్టం జరగకుండా తప్పింది.
సమాచారం అందుకున్న కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. క్రేన్ల సహాయంతో బోల్తాపడిన కంటైనర్‌ను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో పెద్ద ప్రమాదం తప్పినందుకు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!