

‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్‌లో కలిశారు. కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో ఈ సమావేశం జరగడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీకి సంబంధించిన చిత్రాలను రాష్ట్రపతి కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా పంచుకుంది.
ఇదే రోజు కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ తన పదవికి రాజీనామా చేయడం, దానికి రాష్ట్రపతి ఆమోదం తెలపడం రాజకీయ చర్చలకు దారితీసింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మరికొంతమంది కేంద్రమంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అలాగే ఇటీవల భాజపా లేదా ఎన్డీయేలో చేరిన నేతలకు కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశమున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ-ముర్ము భేటీ కేంద్ర మంత్రివర్గంలో త్వరలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై మరింత ఆసక్తిని పెంచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!