

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ‘కొరియన్ కనకరాజు’ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రితిక నాయక్ కథానాయికగా నటించగా, సత్య, శ్రీనివాస్ అవసరాల, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించారు. దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాల్లోనూ ఈ చిత్రం వసూళ్ల పరంగా ఆశాజనకమైన ప్రారంభాన్ని అందుకుంది.
ముఖ్యంగా అమెరికా వసూళ్లలో ‘కొరియన్ కనకరాజు’ దూకుడు చూపిస్తోంది. ఇప్పటివరకు అక్కడ 125K డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ముందుకు సాగుతోంది. గత కొంతకాలంగా వరుణ్ తేజ్ నటించిన చిత్రాలు విదేశీ మార్కెట్‌లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయిన నేపథ్యంలో, ఈ ప్రారంభ వసూళ్లు ఆయన అభిమానులకు ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. విడుదలైన తర్వాత శుక్రవారం కూడా వసూళ్లు బలంగా నమోదవడం సినిమాకు కలిసొచ్చిన అంశంగా మారింది. ఇదే జోరు కొనసాగితే వారాంతంతో పాటు రాబోయే రోజుల్లోనూ వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమా సాధిస్తున్న స్పందనతో చిత్రబృందం కూడా ఆనందం వ్యక్తం చేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!