

లేడీ సూపర్‌స్టార్ నయనతార త్వరలోనే అరుదైన డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఆమె నటించిన రెండు విభిన్న చిత్రాలు థియేటర్లలోకి రానుండటం ఆసక్తిని పెంచుతోంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్’ ఆగస్టు 26న విడుదల కానుంది. ఇందులో నయనతార ‘గంగ’ అనే కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్, యాక్షన్ అంశాలతో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
ఆ తర్వాత కేవలం రెండు రోజులకే.. అంటే ఆగస్టు 28న నయనతార కథానాయికగా, కెవిన్ సరసన నటించిన ‘హాయ్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విష్ణు ఎడవణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా ‘టాక్సిక్’కు పూర్తి భిన్నమైన అనుభూతిని అందించనుంది. ప్రేమ, హాస్యం, కుటుంబ భావోద్వేగాలతో ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ చిత్రం ‘టాక్సిక్’కు కేవలం రెండు రోజుల వ్యవధిలో ‘హాయ్’ రావడం సాహసోపేతమైన నిర్ణయంగా ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే నయనతారకు ఉన్న క్రేజ్, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ‘హాయ్’కు బలంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!