

దేశవ్యాప్తంగా తీవ్రమైన వడగాల్పులు కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఎక్కువగా నీరు తాగాలని, మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకూడదని సూచించారు. వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన వారికి సహాయం చేయాలని, ఇళ్ల వద్ద పక్షులు, జంతువుల కోసం నీరు ఉంచాలని పిలుపునిచ్చారు.
వడదెబ్బ లక్షణాలు అయిన తల తిరగడం, వికారం, అలసట వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దని ప్రధాని హెచ్చరించారు. ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే నీడలోకి తీసుకెళ్లాలని సూచించారు. భారత వాతావరణ శాఖ ప్రకారం దిల్లీ-ఎన్సీఆర్ సహా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిశా, తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ నెలాఖరులో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!