

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బ్రహ్మోత్సవం సినిమా 2016లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా ఫ్లాప్ కావడానికి గల కారణాలను నిర్మాత పొట్లూరి వీరప్రసాద్ వెల్లడించారు. షూటింగ్ ప్రారంభానికి ముందు స్క్రిప్ట్ పూర్తి చేయకుండా సినిమా మొదలుపెట్టొద్దని దర్శకుడికి మెయిల్ చేసినట్లు ఆయన తెలిపారు.
డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల డబ్బులతో సినిమాలు తెరకెక్కుతాయని, పూర్తి ప్రణాళిక లేకుండా షూటింగ్ చేయడం సరైంది కాదని నిర్మాత పేర్కొన్నారు. బ్రహ్మోత్సవం కథ మంచి కథేనని, కానీ దర్శకుడి నిర్లక్ష్యం, క్రమశిక్షణ లేకపోవడం వల్ల సినిమా దెబ్బతిందని అన్నారు. సినీ పరిశ్రమలో డిసిప్లిన్ లేకపోవడం కూడా పెద్ద సమస్య అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!