
రాజకీయాలు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక అంశాలు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే సీనియర్ కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను కూడా కలవనున్నారు.
చెన్నై మెట్రో రైలు విస్తరణ, జీఎస్టీ పరిహారం బకాయిల విడుదల, కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధాన మంత్రికి వినతిపత్రం అందజేయనున్నారు. అలాగే ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రముఖ తమిళ కవి-సన్యాసి తిరువళ్లువర్ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!