
క్రీడలు

ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ దర్శకుడు భారతీరాజా మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనారోగ్య కారణాలతో జూన్ 10న ఆయన కన్నుమూశారు. ఆయన మరణం సినిమా పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్న మోదీ, తమిళ సినిమాకు కొత్త రూపురేఖలు తీసుకువచ్చిన ఘనత భారతీరాజాదేనని కొనియాడారు. గ్రామీణ జీవనాన్ని వెండితెరపై ఆవిష్కరించిన ఆయన ప్రత్యేక శైలి ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు.
ఇక అగ్ర నటుడు వెంకటేశ్ దగ్గుబాటి కూడా భారతీరాజాకు నివాళులు అర్పించారు. ఆయన మరణం తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ, ఆయన ఒక అసాధారణ దర్శకుడిగా, అనేక మందికి మార్గదర్శిగా నిలిచారని చెప్పారు. భారతీరాజా సినిమాలు భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!