

హర్మూజ్ జలసంధి నిర్వహణపై ఒమన్‌తో ఇరాన్ చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి తెలిపారు. టెహ్రాన్‌లో జరిగిన రెండు రోజుల సమావేశాల్లో ఇరుదేశాల డిప్యూటీ విదేశాంగ మంత్రులు విస్తృతంగా చర్చలు జరిపారు. వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం లేకుండా, ఇరుదేశాల సార్వభౌమాధికారానికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవడంపై చర్చలు జరిగాయి. సాంకేతిక, రాజకీయ అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు.
అమెరికా దాడులు తాత్కాలికంగా నిలిపివేయడంతో ఈ చర్చలు మరింత వేగం పుంజుకున్నాయి. ముందుగా హర్మూజ్ గుండా ప్రయాణించే నౌకలపై సేవా రుసుముల అంశం ఉద్రిక్తతలకు దారితీసింది. అమెరికా చర్యలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారగా, ఇరాన్ ప్రతిస్పందనగా నౌకల ప్రయాణంపై ఆంక్షలు విధించింది. దీంతో ఒమన్ తీర మార్గాన్ని అమెరికా ప్రోత్సహించింది. అయితే తాజా పరిణామాలతో టెహ్రాన్, మస్కట్ మధ్య చర్చలు మళ్లీ సానుకూల దిశగా సాగుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!