

హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో నరేంద్ర మోదీ రూ.9,377 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కాకతీయ టెక్స్టైల్స్ పార్క్‌ను ప్రారంభించిన ప్రధాని, గుడెబల్లూర్–మహబూబ్‌నగర్ నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. తెలంగాణ అభివృద్ధికి ఊతమిచ్చే పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులను ఈ కార్యక్రమంలో ప్రారంభించారు.
సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ, సైబరాబాద్ సామర్థ్యం అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారిందని చెప్పారు. వరంగల్ పీఎం మిత్ర పార్క్ దేశ టెక్స్టైల్స్ రంగానికి బలాన్నిస్తుందని తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారులు రెట్టింపు అయ్యాయని, ప్రస్తుతం రాష్ట్రంలో రూ.15 వేల కోట్ల రైల్వే పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. తెలంగాణకు రైల్వే బడ్జెట్లో రూ.5,500 కోట్లు కేటాయించినట్లు ప్రధాని ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!