

లండన్ నుంచి ఢాకాకు వెళ్తున్న బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమాన ప్రయాణ సమయంలో ఇద్దరి మధ్య మొదలైన వాగ్వాదం కాస్తా భౌతిక దాడికి దారితీసింది. ఇద్దరూ పరస్పరం ముష్టిఘాతాలు చేసుకోవడంతో ఓ ప్రయాణికుడి షర్టు చిరిగిపోయింది. దీంతో ఇతర ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. క్యాబిన్ సిబ్బంది, తోటి ప్రయాణికులు జోక్యం చేసుకుని గొడవను అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే ఈ ఘర్షణకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. విమానంలో ప్రయాణికుల భద్రతపై ఈ ఘటన ఆందోళన కలిగించిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఘటనపై విచారణ చేపట్టనున్నట్లు బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ జనరల్ మేనేజర్ మహబూబుద్దీన్ అహ్మద్ తెలిపారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు, తదుపరి చర్యలపై స్పష్టత రావాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!