

రాప్తాడు కేసులో నిందితుడైన హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాలంటే స్వతంత్ర దర్యాప్తు అవసరమని పిటిషనర్ కోరారు. ఈ క్రమంలో ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్, సీసీటీవీ రికార్డులు, వైద్య నివేదికలు, ఫోరెన్సిక్ ఆధారాలను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. కీలక ఆధారాలు నష్టపోకుండా లేదా తారుమారు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే హేమంత్ వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డీజీపీ, జిల్లా కలెక్టర్‌తో పాటు మరో తొమ్మిది మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. అందిన సమాచారం ప్రకారం, ఈ పిల్‌పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. విచారణ సందర్భంగా పిటిషనర్ చేసిన విజ్ఞప్తులపై న్యాయస్థానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!