
జనరల్

ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీలుగుమిల్లి హైస్కూల్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంతో ప్రయాణికులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!