
టెక్నాలజీ

పార్లమెంటు సమావేశాల కొనసాగింపుపై లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు వేర్వేరుగా బులెటిన్లు విడుదల చేశాయి. ఆగస్టులో వాయిదాపడిన సమావేశాలకు కొనసాగింపుగానే తదుపరి కార్యకలాపాలు ఉంటాయని ఈ బులెటిన్ల ద్వారా వెల్లడించాయి. ఉభయసభల సచివాలయాలు రాత్రి వేర్వేరుగా ఈ ప్రకటనలు విడుదల చేశాయి. కాగా, ఆగస్టు 13న లోక్‌సభ, రాజ్యసభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. అప్పటి నుంచి పార్లమెంటును రాష్ట్రపతి ప్రోరోగ్ చేయలేదని బులెటిన్లలో పేర్కొన్నారు.
మరోవైపు, సభలో చేపట్టాల్సిన కార్యకలాపాలు, శాసనపరమైన అంశాలకు సంబంధించిన బిజినెస్ బులెటిన్‌ను లోక్‌సభ సచివాలయం విడుదల చేసింది. పార్లమెంటు సమావేశాల కొనసాగింపుపై వెలువడిన ఈ ప్రకటనలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆగస్టులో వాయిదాపడిన సమావేశాల ప్రక్రియను కొనసాగించేందుకు అవసరమైన పార్లమెంటరీ విధివిధానాలపై ఈ బులెటిన్లు స్పష్టతనిచ్చాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!