
జనరల్

ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఐదు రోజుల పాటు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అత్యవసర పనులు లేకుండా మధ్యాహ్న సమయంలో బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మినహా మిగతా కోస్తా జిల్లాలన్నింటికీ వడగాల్పుల హెచ్చరికలు జారీ చేశారు.
కొన్ని కోస్తా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక కూడా ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తగినంత నీరు తాగుతూ ఎండలో ఎక్కువసేపు తిరగవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!