
జనరల్

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావంతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలు మరింత ఖరీదవనున్నాయి. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ మరియు క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై ఇంధన భారంతో అదనపు ఖర్చులు పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. దీంతో త్వరలోనే డెలివరీ ఛార్జీలు, ప్లాట్‌ఫారమ్ ఫీజులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు పెరిగిన ఇంధన ధరలపై గిగ్ వర్కర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ ఖర్చులు, బండి మెయింటెనెన్స్ వ్యయాలకు తగినట్లుగా కమిషన్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. లాభాలను కాపాడుకునేందుకు కంపెనీలు ఈ అదనపు భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!