4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌లో ఇళ్ల కొనుగోలుకు ఎన్‌ఆర్‌ఐల ఆసక్తి

Writer: G.Sreekanth Reddy 08:52 AM, 4 నవంబర్, 2026
భారత్‌లో ఇళ్ల కొనుగోలుకు ఎన్‌ఆర్‌ఐల ఆసక్తి

విదేశాల్లో స్థిరపడిన భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) స్వదేశంలో ఇళ్లు, స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో పెట్టుబడి, ఆస్తి విలువ పెరుగుదలే ప్రధాన లక్ష్యాలుగా ఉండగా.. ఇప్పుడు అద్దె ఆదాయం, మెరుగైన నిర్మాణ నాణ్యత, రవాణా సౌకర్యాలు, వైద్య సేవలు వంటి అంశాలకూ ప్రాధాన్యం ఇస్తున్నారు. తల్లిదండ్రులకు సౌకర్యవంతమైన నివాసం ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా వారి నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, పుణే, హైదరాబాద్‌ నగరాలు ఎన్‌ఆర్‌ఐల దృష్టిని ఆకర్షిస్తున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అంతర్జాతీయ విమాన సదుపాయాలు, విస్తరిస్తున్న మౌలిక వసతులు, వివిధ ధరల్లో అందుబాటులో ఉన్న నివాస గృహాలు ఎన్‌ఆర్‌ఐలను ఆకర్షిస్తున్నాయి. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో కొత్త ప్రాంతాలు అభివృద్ధి చెందుతుండటంతో సంప్రదాయ ఖరీదైన ప్రాంతాలకు బయట కూడా కొనుగోలు అవకాశాలు పెరుగుతున్నాయి.

ఐటీ రంగానికి కేంద్రంగా ఉన్న బెంగళూరులో వైట్‌ఫీల్డ్‌, సర్జాపూర్‌, ఉత్తర బెంగళూరు ప్రాంతాలపై కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఉద్యోగావకాశాలు అధికంగా ఉండటంతో అద్దె ఇళ్లకు డిమాండ్‌ ఉండటం కూడా పెట్టుబడిదారులకు కలిసొస్తోంది.ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలోని గురుగ్రామ్‌లో ప్రీమియం నివాస ప్రాజెక్టులు, కార్పొరేట్‌ సంస్థలు, మెరుగుపడుతున్న రవాణా సదుపాయాలు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఉన్న ఎన్‌ఆర్‌ఐలకు అక్కడ ఇల్లు కొనడం మరో ప్రయోజనంగా మారుతోంది.


ఐటీ, వైద్య రంగాల అభివృద్ధి, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలతో హైదరాబాద్‌ కూడా ఎన్‌ఆర్‌ఐలకు ఆకర్షణీయమైన రియల్‌ ఎస్టేట్‌ కేంద్రంగా ఎదుగుతోంది. ముఖ్యంగా నగర పశ్చిమ, వాయవ్య ప్రాంతాల్లో ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అనుసంధానమైన నివాస ప్రాంతాలపై ఆసక్తి పెరుగుతోంది. ఉద్యోగ కేంద్రాలకు సులభంగా చేరుకునే అవకాశం, రవాణా సదుపాయాలు కొనుగోలు నిర్ణయాల్లో కీలకంగా మారుతున్నాయి. ఎన్‌ఆర్‌ఐ కుటుంబాలు ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు తల్లిదండ్రుల భవిష్యత్తు అవసరాలనూ పరిగణనలోకి తీసుకుంటున్నాయని నివేదికలు చెబుతున్నాయి. వైద్య సేవలకు చేరువగా ఉండటం, సామాజిక సంబంధాలు, బహిరంగ ప్రదేశాలు, అవసరమైనప్పుడు సహాయం అందే సదుపాయాలు కూడా ముఖ్యమని వివరించారు. దీంతో స్వదేశంలో స్థిరాస్తి కొనుగోలు నిర్ణయాలు కేవలం పెట్టుబడికే పరిమితం కాకుండా కుటుంబ అవసరాలతోనూ ముడిపడుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ, డీఆర్‌ 3 శాతం పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ, డీఆర్‌ 3 శాతం పెంపు

అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న వ్యోమగాములు

అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న వ్యోమగాములు

ఏపీకి మరో తుఫాను ముప్పు..

ఏపీకి మరో తుఫాను ముప్పు..

దీపావళి సందర్భంగా చెన్నై సెంట్రల్‌-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

దీపావళి సందర్భంగా చెన్నై సెంట్రల్‌-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

సదర్ ఉత్సవాలు యాదవుల ఆత్మగౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్ రెడ్డి

సదర్ ఉత్సవాలు యాదవుల ఆత్మగౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్ రెడ్డి

కండక్టర్ ప్రవళిక మృతిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

కండక్టర్ ప్రవళిక మృతిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

ట్యాగ్లు
ముంబైబెంగళూరుఢిల్లీ-ఎన్‌సీఆర్‌పుణేహైదరాబాద్‌ఐటీఅద్దె ఆదాయంఇళ్ల కొనుగోలుఎన్ ఆర్ ఐ లుబెంగళూరు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దర్శకుల ప్రతిభకు మరో పరీక్షగా మారుతున్న ఓటీటీ?
సినిమాలు

దర్శకుల ప్రతిభకు మరో పరీక్షగా మారుతున్న ఓటీటీ?

బిగ్‌బాస్ తెలుగు 10: డే 59 ప్రోమో 1 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: డే 59 ప్రోమో 1 విడుదల

చిరంజీవి - తుడరుమ్ దర్శకుడి కాంబోలో సినిమా?
గాసిప్స్

చిరంజీవి - తుడరుమ్ దర్శకుడి కాంబోలో సినిమా?

బిగ్‌బాస్ తెలుగు 10: ఈ వారం డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఎలిమినేషన్ ముప్పులో టాప్ కంటెస్టెంట్స్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఈ వారం డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఎలిమినేషన్ ముప్పులో టాప్ కంటెస్టెంట్స్!

సూపర్ డైవ్‌తో సింగిల్ హ్యాండ్ క్యాచ్.. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా!
క్రీడలు

సూపర్ డైవ్‌తో సింగిల్ హ్యాండ్ క్యాచ్.. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా!

కండక్టర్ ప్రవళిక కుటుంబానికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. మంత్రి పొన్నం హామీ
జనరల్

కండక్టర్ ప్రవళిక కుటుంబానికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. మంత్రి పొన్నం హామీ

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు!
రాజకీయాలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు!

కింగ్ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్!
సినిమాలు

కింగ్ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్!

బిగ్‌బాస్ తెలుగు 10 : అదేంటి.. వర్షిణికి వాళ్లిద్దరూ అలా కౌంటర్ ఇచ్చారేంటి?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 : అదేంటి.. వర్షిణికి వాళ్లిద్దరూ అలా కౌంటర్ ఇచ్చారేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10: హౌస్‌లో రెండు గ్రూపులుగా విడిపోయిన కంటెస్టెంట్లు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: హౌస్‌లో రెండు గ్రూపులుగా విడిపోయిన కంటెస్టెంట్లు

దక్షిణ కోస్తాను ముంచెత్తిన భారీ వర్షాలు
జనరల్

దక్షిణ కోస్తాను ముంచెత్తిన భారీ వర్షాలు

భారీ బ్యాటరీ, అద్భుతమైన డిస్‌ప్లేతో REDMAGIC కొత్త గేమింగ్ ఫోన్ లాంచ్
టెక్నాలజీ

భారీ బ్యాటరీ, అద్భుతమైన డిస్‌ప్లేతో REDMAGIC కొత్త గేమింగ్ ఫోన్ లాంచ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!