

తిరుమలలో టీటీడీ అధికారులు 12 టన్నుల జీడిపప్పును తిరస్కరించి వెనక్కి పంపించారు. టీటీడీ అవసరాల కోసం పార్వతీపురం నుంచి తిరుమలలోని టీటీడీ గోడౌన్‌కు జీడిపప్పును తరలించారు. తిరుమలకు సరుకు చేరుకున్న అనంతరం అధికారులు నమూనాలు సేకరించి, తిరుమలలోని టీటీడీ ఆహార విశ్లేషణ ప్రయోగశాలలో నాణ్యత పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో టీటీడీ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు జీడిపప్పు అనుగుణంగా లేదని గుర్తించారు.
దీంతో 12 టన్నుల జీడిపప్పును పూర్తిగా తిరస్కరించి, సరఫరాదారులకు వెనక్కి పంపినట్లు అధికారులు తెలిపారు. టీటీడీ అవసరాలకు సరఫరా చేసే ముడిసరుకుపై నాణ్యత విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యమైన ముడిసరుకును మాత్రమే వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ముందస్తు నాణ్యత పరీక్షలు పూర్తికాకముందే సరుకు సరఫరా చేయడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!