

రాజధాని అమరావతి పరిధిలోని గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో మంగళగిరి మండలం నిడమర్రు జెడ్పీ హైస్కూల్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేశారు. రాష్ట్రంలోనే తొలి ప్రభుత్వ అంతర్జాతీయ నమూనా పాఠశాలగా రూపుదిద్దుకున్న ఈ విద్యాసంస్థను సుమారు 5.2 ఎకరాల్లో, రూ.16 కోట్ల వ్యయంతో ఆధునిక సాంకేతికత ఆధారంగా నిర్మించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ పాఠశాల జూన్ రెండో వారంలో ప్రారంభం కానుంది.
విద్యార్థుల కోసం ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన సదుపాయాలు, విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలు, గ్రంథాలయం, అటల్ టింకరింగ్ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. అలాగే క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం బహుళ క్రీడా వేదికలు, పరుగు ట్రాక్, యాంఫీ థియేటర్, సైన్స్ మ్యూజియంను సిద్ధం చేశారు. భద్రత కోసం సీసీ కెమెరాలు, పరిశుభ్రత కోసం తాగునీటి కేంద్రం, భోజనశాల వంటి వసతులను కల్పించారు. ఈ పాఠశాల ప్రభుత్వ విద్యా రంగంలో కొత్త దిశను చూపనుందని అధికారులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!