
జనరల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మరణాలు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. వైఎస్సార్ కడప జిల్లాలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, వారికి నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మళ్లీ చర్చ మొదలైంది.
అయితే ఈ మరణాల విషయం బుధవారం వరకు ప్రభుత్వానికి తెలియకపోవడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఆరోగ్య శాఖ సమాచారం సేకరణలో లోపాలున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టే అవకాశముంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!