

గూగుల్ భారత్‌లో స్క్రీన్‌లెస్ ఫిట్‌నెస్ ట్రాకర్ ‘ఫిట్‌బిట్ ఎయిర్’ను విడుదల చేసింది. రూ.13,999 ధరతో లభించనున్న ఈ డివైజ్ అక్టోబర్ 2 నుంచి విక్రయానికి రానుంది. సాధారణ స్మార్ట్‌వాచ్‌లకు భిన్నంగా ఇందులో డిస్‌ప్లే లేదా మణికట్టుపై నోటిఫికేషన్లు ఉండవు. స్టెప్స్, వర్కౌట్స్, హార్ట్‌రేట్, హార్ట్ రిథమ్, నిద్ర వ్యవధి, స్లీప్ స్టేజ్‌ల వంటి ఆరోగ్య, ఫిట్‌నెస్ వివరాలను ఇది ట్రాక్ చేస్తుంది. పలు కార్యకలాపాలను ఆటోమేటిక్‌గా గుర్తించి, డేటాను గూగుల్ హెల్త్ యాప్‌తో సింక్ చేస్తుంది.
ఫిట్‌బిట్ ఎయిర్‌లో గూగుల్ హెల్త్ కోచ్ కీలక ఫీచర్‌గా ఉంది. జెమినీ ఆధారంగా పనిచేసే ఈ కోచ్ వినియోగదారుల ఆరోగ్య, ఫిట్‌నెస్ డేటాను విశ్లేషించి వ్యక్తిగత సూచనలు, అంతర్దృష్టులను అందిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏడు రోజుల వరకు బ్యాటరీ పనిచేస్తుందని గూగుల్ తెలిపింది. ఐదు నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఒక రోజు వరకు బ్యాటరీ పొందవచ్చు. ఆబ్సిడియన్, బెర్రీ, లావెండర్, ఫాగ్ రంగుల్లో లభించే ఈ ట్రాకర్‌తో మూడు నెలల గూగుల్ హెల్త్ ప్రీమియం ట్రయల్ కూడా అందిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!