
ఓటీటీ

నీట్ యూజీ-2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ వేగవంతం చేసింది. మంగళవారం కేసు నమోదు చేసిన అధికారులు వరుసగా పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈరోజు ఉదయం రాజస్థాన్‌కు చెందిన మంగీలాల్, దినేశ్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు, తాజాగా పుణెకు చెందిన ఓ మహిళను కూడా విచారణ నిమిత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఈ కేసుతో సంబంధం ఉందనే అనుమానంతో పుణె పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని తరువాత కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించారు. ఆమెను బిబ్వేవాడి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు పుణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. స్థానిక పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం ఆమెను దర్యాప్తు అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు. అయితే, కేసులో ఆమె పాత్రపై పూర్తి వివరాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!