

పోలవరం పాపికొండల విహారయాత్రలో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయం సమీపంలో ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన బోటులో నీరు చేరడాన్ని సిబ్బంది ముందుగానే గుర్తించడంతో ముప్పై ఎనిమిది మంది పర్యాటకులు సురక్షితంగా బయటపడ్డారు. పర్యాటకులు విహారయాత్ర కోసం ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకుని బోటు పాయింట్‌కు చేరుకున్నారు.
ప్రయాణానికి రెండు గంటల ముందే బోటు సాధారణం కంటే ఎక్కువగా నీటిలోకి దిగినట్లు గమనించిన సిబ్బంది వెంటనే పరిశీలించారు. బోటు ముందు భాగంలోని జాయింట్ వద్ద స్వల్ప పగులు ఏర్పడి నీరు లోపలికి వస్తున్నట్లు గుర్తించారు. వెంటనే నీటిని బయటకు తొలగించి, ఉన్నతాధికారుల సూచనల మేరకు పర్యాటకులను ‘విజయగంగ’ అనే మరో బోటులో సురక్షితంగా పంపించారు. పూర్తి మరమ్మతులు పూర్తయ్యే వరకు ఆ బోటును సేవల్లోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!