
బిజినెస్

తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున 33 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తామని ఆయన తెలిపారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినా లేదా కాకపోయినా ఈ నిర్ణయం అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ఉదయం చేసిన “బిగ్ అనౌన్స్‌మెంట్” పోస్టుకు అనుగుణంగా ఈ ప్రకటన చేసిన లోకేశ్, రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. నిర్ణయాధికార స్థానాల్లో మహిళల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ నిర్ణయ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!