
ఓటీటీ

తడిసిన ధాన్యాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.
అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే 9,214 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించినట్లు వెల్లడించారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు నష్టం వాటిల్లే చర్యలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సహించదని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!