

రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపై మంత్రి నారాయణ సీఆర్డీఏ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ కార్తీక్‌తో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. ల్యాండ్ పూలింగ్ కోసం ఇప్పటికే నోటిఫై చేసిన భూములు ఎంత మేర సమీకరించారనే దానితో పాటు ఇంకా ఎంత భూమిని సమీకరించాల్సి ఉంది, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయనే వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అమరావతిలో కొనసాగుతున్న రోడ్లు, ఇతర నిర్మాణ పనులకు ఇంకా ఎంత మేర భూమి అవసరమవుతుందనే అంశంపైనా మంత్రి నారాయణ ఆరా తీశారు. రైతులతో నేరుగా మాట్లాడి ల్యాండ్ పూలింగ్‌కు సహకరించేలా వారిని ఒప్పించాలని అధికారులకు సూచించారు. రైతులు లేవనెత్తుతున్న సందేహాలను నివృత్తి చేసి, వారికి ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!