
జనరల్

బెంగళూరులో సాంకేతిక లోపం కారణంగా కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో సేవలు నిలిచిపోవడంతో టెకీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికే నగర ట్రాఫిక్‌తో సతమతమవుతున్న ఉద్యోగులు త్వరగా ఇళ్లకు చేరుకునేందుకు లారీలు, ట్రక్కులు ఎక్కి ప్రయాణించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి. మెట్రో సేవల్లో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వీ సూర్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!